శివుడు పార్వతితో చెప్పిప్న సంపూర్ణ స్త్రీ సౌందర్య శుబాశుబ లక్షణాలు:
స్త్రీ యొక్క సర్వాంగాలు సౌందర్య శోబితాలుగా ఉండాలి.
మదపుటేనుగు వంటి నడక కలిగి ,ఎతైన పిరుదులు కలిగి ,సన్ననైన నడుము కలిగి ,ఒకదానినొకటి ఒరుసుకునే ఎతైన గుండ్రని వక్షోజాలు కలిగి వుండాలి.
ఎక్కువ లావు ,ఎక్కువ సన్నము లేక మధ్యమ స్థాయిలో వుండి ,తల పైన ,మర్మ స్థానాలలో తప్ప మిగిలిన దేహ బాగాలలో అనవసర రోమాలు లేకుండా చర్మమంతా నునుపుగా ,మెరుపుగా ఉండాలి.
సమతలమైన బూమి మీద నడిచేటపుడు అడుగు జాడలు స్పష్టంగా కనిపించే పాదాలు కలిగి వుండి బొటన వేలంత ప్రమాణంగా ప్రధాక్షినాక్రుతి లో సుడి కలిగిన నాబి(బొడ్డు) వుండాలి.
రావి ఆకు ఆకృతి వలె వుండే భాగము(యోని) గల స్త్రీ శుబాంగి అనబడుతుంది.
ఒకదానినొకటి కలుసుకోనని కనుబొమ్మలు కలిగి ,ఇప్ప పువ్వుల వలె నిగాగాలాడే చెక్కిళ్ళు ,శరీరం పైన నరాలు ,రోమాలు కనిపించకుండా వుండాలి .
నక్షత్రములు ,వృక్షములు ,నదులు వీటి పేర్లు లేకుండా ఉండి ,ఎల్లప్పుడు అసూయ ద్వేషాలకు అతీతురాలిగా ,ప్రేమానురాగాలకు ప్రతి రూపిణిగా ,కలహా స్వబావము లేని మృదు బాషినిగా ,ఎల్లప్పుడు చిరునవ్వులతో ఇంటికి వెలుగుగా వుండే స్త్రీలు సంపూర్ణ శుబ లక్షణాలతో కూడిన సౌందర్య రాశులనబడతారు అని మహాదేవుడు స్త్రీ పురుష లక్షణాలను వివరించారు.
పార్వతి దేవి తన సంశయము ఇంకా తీరనట్లుగా "స్వామి! ప్రతి స్త్రీ ని ప్రతి పురుషుని మీరు అదేవిధంగా సృష్టించవచ్చు కదా! ఎందుకు ఆ విధంగా జరుగుట లేదు" అని ప్రశ్నించింది.అందుకు పరమేశ్వరుడు "దేవి మన సృష్టిలో ఎటువంటి లోపము లేదు మనము అందరిని ఒకే విధంగా సృష్టిస్తున్నాము. కాని మానవులే వారి వారి స్వయంక్రుత కర్మలతో అదుపు లేని ,విహార ,వ్యవహార నియమాలతో ,అంతు లేని కామ క్రోధ లోబ మోహ మధ మాత్సర్యాలతో ,తమ శారీరక సౌందర్యాన్ని తమ మానసిక ఔన్నత్యాన్ని పోగొట్టుకుని వికృత స్వరూపులై వింత వింత రోగాల బారినపడి బలైపోతున్నారు." అన్నారు.అందుకు పార్వతీ దేవి నాదా! మరి మన బిడ్డలు రక్షిమ్పబడే మార్గమే లేదా అని అడుగగా " ఎందుకు లేదు దేవి వారి తప్పులను వారే సరిదిద్దుకుని ,వారి సంస్కృతిని వారు ఆచరించి ,సాటి మానవులను ఆదరించే మానవతా హృదయాన్ని పెంచుకున్నప్పుడు సౌందర్య స్వరూపులవుతారు " అని వివరించినారు.
The print is in Yellow colour on white background.. not readable
ReplyDelete