మర్రిచెట్టు తో ఆయుర్వేదం
[1]. మర్రి ప్రాంతకాలమందు ఒక గ్రాము ఎత్తు చొప్పున మొదటి రోజున పంచదార పాకములో కలిపి పుచుకోనవలెను.2 వ రోజు 2gm ఏతు మర్రిపాలు పంచదార పానకములో కలిపి పుచ్చుకొనవలెను.ఇట్లు రోజుకు ఒక్కొక్క gm పాలు ఎక్కువ చేయుచు 11 రోజులు సేవించి 12 వ రోజు నుంచి ఒక్కొక్క gm ఏతు పాలు తాగించుచు తిరిగి gm ఏతు పాలు తగ్గించుచు తిరిగి 11 రోజు లు మర్రి పాలను పంచదార పానకములో కలిపి సేవించు చుండిన యెడల వీర్య నష్టము ,మూత్ర బంధము ,స్త్రీల బట్టంటూ వ్యాధులు సంపూర్ణముగా హరించి మెదడుకు ,గుండెకు బలము కలిగి ,శరీరము ఆరోగ్యముతో పుష్టిగా ఉండును.
[2]. నీళ్ళల్లో ,బురదలో తిరుగుచుండె వారికి కాళ్ళ వెల్ల సందులో పాచి పుండ్లు పడి,అపరిచితమైన దురదలు ,బాధలు కలుగుచుండె వారికి కాళ్ళ వెల్ల సందులో మర్రి పాలు పట్టించు చుండిన అన్ని బాధలు తక్షణమే తగ్గిపోవును.
[3]. శరీరము పైన ఎక్కడైనా మంటగా ఉన్న యెడల మర్రి పాలు పైన రాసిన వెంటనే తగ్గిపోవును.
[4].కాళ్ళ పిక్కల పైన, తొడల పైన లేచెడి కురుపులకు గడ్దలకు మర్రి పాలు పట్టి వేసిన తొందరగా అణిగి పోవుట గాని పగిలిపోవుట గాని జరుగును.
[5]. నడుము నొప్పికి పైన మర్రి పాలు పట్టీ వేసిన యెడల తగ్గిపోవును.ఇట్లు 3 పట్టీలు వేయవలెను.
[6]. పిప్పిపంటిపై మర్రి పాలు 3 చుక్కలు వేసిన పురుగు చచ్చి బాధ తగ్గును.
[7]. చెవి పోటుకు 2 చుక్కల మర్రి పాలు చెవిలో వేసిన పురుగు చచ్చి చెవి పోటు తగ్గును.
[8]. ఒక చుక్క మర్రి పాలను కంట్లో వేసిన కంట్లో మంటలు తగ్గిపోవును.
[9]. పోటు పుట్టుచుందే సెగ గడ్డలపైన ,మర్రి పాలు పట్టి వేయుచుండిన యెడల బాధలు వెంటనే శాంతించును.
[10]. బొడ్డు లోపల ,బొడ్డు చుట్టూ మర్రి పాలు పట్టించిన యెడల అన్ని రకముల విరేచనములు అద్బుతముగా తగ్గును.
[11]. 2gm మర్రిపాలను పంచదార లో కలుపుకుని ప్రాంత్హకాలమందు తినవలెను ఇట్లు 3 రోజులు ఉదయం పూట తినిన యెడల మూత్ర బంధము మూత్రము బొట్లు బొట్లు గా పడుట హరించును.
[12]. రాకత మొలల వ్యాధి వలన గాని ,స్త్రీల ఎర్రబట్ట వ్యాధి వలన గాని లేక మరియే ఇతర కారణము చేతనైన శరీరము నుండి పై బాగము గుండా రక్తము పోవు చున్న యెడల 5,6 చుక్కల మర్రి పాలను పంచదార పానకములో తాగించావలెను.
[13]. మెడ చుట్టూ గడ్డలు లేచే కంట మాల వ్యాధి పైన మర్రి పాలు పట్టీ వేయుచుండిన యెడల తొందరగా నయమగును.
[14]. కత్తి నరుకులపై గాని లేక ఏ విధమైన గాయముల పై గాని మర్రి పాలను పట్టించిన యెడల గాయమును తొందరగా మాన్పి ,చర్మమును అతుక్కోనునట్లు చేయును.
[15]. మర్రి చెట్టు పై చర్మమును దంచి నీళ్ళల్లో కాచి ఇచ్చిన అతి మూత్ర వ్యాధి హరించును.
[16]. మర్రి చెట్టు పాచి బెరడును దంచి తీసిన రసమును పూటకు 10gm చొప్పున త్రాగించుచుండిన యెడల మధుమేహ వ్యాధి నిస్సందేహముగా హరించును.
[17]. మర్రి చెక్క ,రావి చెక్క 2 కలిపి దంచి ,కషాయము కాచి ఆ కశాయముతో పుక్కిలించి ఉమ్మి వేసిన యెడల చిగుళ్ళ వాపు వంటి బాధలు హరించును.
No comments:
Post a Comment