Saturday, January 24, 2009

శృంగార(సెక్స్) సబంధ చిట్కాలు

వీర్య స్థంబన
[1].పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి ,అరకప్పు పాలల్లో కలిపి అందులో 20gm పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 పూటలా తాగుతూ వుంటే వీర్య స్థంబన జరుగుతుంది.
[2].చిల్ల గింజలను అంటే ఇండుప గింజల ను పాలలో వేసి నానబెట్టి ముద్దగా నూరి ,అందు లో సమంగా దాల్చినచెక్క చూర్ణము కలిపి నూరి బటాని గింజలంత మాత్రలు చేసి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక మాత్రను పాలల్లో అనుపానంగా సేవిస్తూ వుంటే వీర్య వృద్ధి ,వీర్య స్థంబన కలుగుతాయి.
[3].సొరకాయ ముక్కలను ఆవు నేతి లో వేయించుకుని పరిమితంగా తింటూ వుంటే శీగ్ర స్కలన సమస్య తగ్గి రతిలో ఎక్కువ సేపు పాల్గొనవచ్చు.
[4].రోజు రాత్రి పరుండే ముందు తమలపాకు లో ఒక gm జాపత్రి వుంచి నమిలి తింటూ వుంటే నరములకు సత్తువ పెరిగి ,వీర్య స్థంబన కలిగి రతి సౌక్యము పెరుగుతుంది.
[5].పైడి ప్రతి దూదిని తేనె మైనం తో నూరి వత్తి చేసి ఆ వత్తిని ఆవు నేతి లో వేసి దీపం పెట్టి ఆ వెలుతురు లో స్త్రీ తో సంబోగం జరిపితే పురుషునికి వీర్య స్థంబన కలుగుతుంది.

స్వప్నం లో వీర్య నష్టం
దాల్చిన చెక్క ,చలువ మిరియాలు ,రేవల చిన్ని ఈ 3 పదార్ధాలు ప్రతిది 5gm చొప్పున తీసుకోవాలి.తవాక్శీరి , యాలక గింజలు 10gm చొప్పున తీసుకోవాలి.ఈ వస్తువులన్నీ కలిపి మేతగా దంచి చూర్ణం చేసి నిలువ వుంచుకోవాలి.రోజుకు 3gm మోతాదుగా 2 పూటలా అర స్పూన్ తేనె కలిపి తింటూ వుంటే స్వప్నం లో వీర్య నష్టం ఆగిపోతుంది.

లింగ బలానికి
[1].ఉదయమే పండ్లు తోముకోక ముందు కొంచెం దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని అరచేతిలో ఉమ్మి వేసుకుని ,దాన్ని లింగానికి ముందు బాగాన్ని వదిలి లేపనం చేస్తూ వుంటే లింగ బలహీనత తొలిగి పోయి మంచి వుద్ధాపన శక్తి కలుగుతుంది.
[2].అశ్వగంధ దుంపను సానరాయి మీద గోమూత్రము లో ఆ గంధాన్ని లింగము పైన (ముందు బాగం వదిలి) లేపనం చేసుకుంటూ వుంటే లింగం బలపడి మగతనం పెరుగుతుంది.
[3].వాకుడు పండ్లు ,పెన్నేరు దుంపలు ,ఆవాలు ,చెంగుల్వ కోష్టు సమబాగాలుగా కలిపి పొడి చేసి ఉంచుకుని ,రోజు కొంచెం పొడిని నీటితో మెత్తగా నూరి పురుషులు తమ మర్మాంగానికి బుడిపే బాగం వదిలి వెనుక బాగానికి లేపనం చేసి అది ఆరి పోగానే వెంటనే ఆలస్యం చేయకుండా గుడ్డతో తుడిచి కడిగి వేయాలి.ఈ విధంగా 40 రోజులు రోజు కు ఒకసారి చేస్తే లింగ బలహీనత తగ్గి బలం కలుగుతుంది.ఇది అనుబవగ్నులైన ఆయుర్వేద వైద్య పండితుల ఆధ్వర్యం లో తయారు చేయించుకుని వాడుకోవాలి.

వీర్య వృద్ధి
[1].నేతిలో వేయించిన మినప పప్పును ఆవు పాలలో వేసి తగినంత చెక్కర కలిపి పాయసంలా వండి రోజు తింటూ వుంటే శరత్కాలము లోని చంద్రుని వలె పురుషులు వలె పురుషులు వీర్య దోష వర్జితులై ప్రకాశిమ్పగలరు.
[2].కర్జూర పండు ,మర్రి వూడలు కలిపి పాలతో నూరి వడపోసి తాగుతూ వుంటే అమితమైన వీర్య వృద్ధి కలుగుతుంది.
[3].అతిమధురం ,నెల తాడి దుంపలు ,పిప్పళ్ళు ,దూల గొండి గింజలు ఈ 4 సమబాగాలుగా తీసుకుని చూర్ణం కొట్టి నిలువ వుంచుకోవాలి.పూటకు 3gm ల చూర్ణము ,6gm పటిక బెల్లం పొడి ,6gm ఆవు నెయ్యి ఒక గ్లాస్ ఆవు పాలల్లో కలిపి 2 పూటలా తాగుతూ వుంటే అమితమైన వీర్య వృద్ధి అవుతుంది.
[4].తులసి విత్తులు , నాగాకేసరములు ,అశ్వగంధ ,మోదుగ ,రావి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క gm వంతున సేకరించి బాగుగా మర్దించి వస్త్ర గాలితము గావించి 10gm ఆవు పాలలో కలిపి సేవించిన 2 నెలల్లో బహిష్టు సక్రమ మగును ,ఏదో కారణమూ చేత ఆగిపోయిన బహిష్టు కూడా సరిఅగును.

బహిష్టు నొప్పి
రుతుమతులైన దినములందు 3 రోజుల పాటు ప్రతి ఉదయం 2gm మిరియాల చూర్ణమును 10gm నెల ఉసిరిక రసంతో కలిపి మింగిన యెడల రుతువుల నిస్సంశయముగా హరిన్చిపోవును.

బహిష్టు ఆగిపోతే
[1].వేప చెట్టు బెరడు 20gm ,శోంటి 2gm ,పాతబెల్లం 20gm ఈ మూడు కలిపి దంచి అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ కషాయం మిగిలేల మరగబెట్టి వడపోసి చల్లార్చి రోజు ఉదయం పూట మాత్రమే తాగుతూ వుంటే 4 రోజుల్లో ఆగిపోయిన బహిష్టు మళ్ళి మొదలవుతుంది.
[2].ప్రత్తి కాయలు పగులగొట్టి నీటిలో వేసి కషాయం కాచి వడ పోసి అర పావు లీటర్ కషాయంలో 20gm పాత బెల్లం కలిపి రోజు ప్రాతఃకాలమందు తాగుతూ వుంటే అతిత్వరలోనే బహిష్టు మొదలవుతుంది.
[3].అరటి ఊచ రసము 2 పూటలా 20gm మోతాదుగా సేవిస్తూ వుంటే ఆగిపోయిన బహిష్టు మరల మొదలై సాఫీగా వస్తూ వుంటుంది.

స్త్రీల స్తనముల బాధ
వెర్రి పుచ వేరును మంచి ఆ గంధాన్ని చన్నుల మీద లేపనం చేస్తూ వుంటే స్థానాలకు సంబంధించిన అన్ని బాధలు హరిన్చిపోతై.

లింగ పటుత్వం
ప్రతి గింజల పప్పు ఒక బాగము ,మేక కొవ్వు 2 బాగములు కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని లింగానికి ముందు బాగం వదిలి వెనుక బాగానికి లేపనం చేస్తూ వుంటే లింగం వంకర పోవుట లింగం ముడుత పడుట హరించి బలపడుతుంది.

బహిష్టు లో అధిక రక్త స్రావానికి
యష్టి మధుకం చూర్ణం పూటకు 3gm మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్ళల్లో 3 పూటలా తాగుతూ వుంటే అతి త్వరగా అధిక ఋతు స్రావము ఆగిపోతుంది.

వీర్య శక్తి
యావాలు మినుములు నానబెట్టి పొట్టు తీసి ఆ పొడిని పాలలో కలిపి పంచదార వేసి పాయసం లాగ వండి రోజు తింటూ వుంటే 40 రోజు లా తరువాత అమితమైన వీర్య శక్తి కలుగుతుంది.

No comments:

Post a Comment