Saturday, January 24, 2009

దాల్చిన చెక్క తో ఆయుర్వేదం

అజీర్ణ రోగము
రోజు బోజనానికి ముందు 2 చిటికలు దాల్చినచెక్క పొడి ,2 చిటికలు శోంటి పొడి ,4 చిటికలు యాలక గింజల పొడి ,కొంచెం మంచి నీళ్ళలో కలిపి తాగుతూ వుంటే అజీర్ణం ,ఆసనం లోని తెపులు తగ్గి పోతాయి.
రక్త విరేచనములు
దాల్చినచెక్క రసములో ,కొంచెం యాలక గింజల పొడి కలిపి సేవిస్తే రక్త విరేచనాలు ,రక్త వాంతులు కట్టుకున్టై .
కఫా జ్వరము
దాల్చిన చెక్క చూర్ణము 3gm ,లవంగా చూర్ణము 2 చిటికలు , శోంటి చూర్ణము 3 చిటికెలు వీటిని ఒక లీటర్ నీటిలో వేసి అరగంట సేపు మరగబెట్టి తరువాత వడపోసి చల్లార్చి 3 గంటలకు ఒకసారి 50gm కషాయాన్ని తాగిస్తూ వుంటే ఊపిరితిత్తులలో కఫము హరించి కఫా జ్వరము హరించి పోతుంది.
కడుపు నొప్పి
దాల్చిన అరకు తెచుకుని అయిదారు చుక్కలు నీటిలో వేసి త్రాగుతో వుంటే కడుపు నొప్పి ,అజీర్ణం ,దగ్గు, ఒగర్పు ,తగ్గుతాయి.ఇంకా ఈ అరకు ఉపయోగించడం వల్ల అత్సార విరేచనాలు ,నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.
తలనొప్పి
దాల్చిన చెక్కను నీటితో సాది ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధించిన తలనొప్పి తగ్గుతాయి.
కొండ నాలుకకు
దాల్చిన చెక్కను నీటితో రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని దూది పుల్లకు అది కొండ నాలుకకు రోజు 3 పూటలా అంటిస్తూ వుంటే 2 లేక 3 రోజుల్లో వాలి పోయిన కొండనాలుక యదాస్థానానికి చేరి దగ్గు తగ్గుతుంది.
లింగ బలానికి
ఉదయమే పండ్లు తోమక ముందు కొంచెం దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని అరచేతిలో ఉమ్మి వేసుకుని దాన్ని లింగానికి(ముందు బాగం వదలి)లేపనంచేస్తూ వుంటే లింగ బలహీనత తగ్గిపోయి ,మంచి ఉద్దాపన శక్తి కలుగుతుంది.
తేలు కాటుకు
దాల్చినచెక్క తైలం 2 చుక్కలు దూదితో తడిపి తేలు కుట్టిన చోట పైన వేసి గుడ్డతో కడితే తేలు విషం వెంటనే దిగిపోయి బాధ తగ్గిపోతుంది.
కడుపులో క్రిములకు
రాత్రి నిద్ర పోయేముందు 2gm దాల్చినచెక్క చూర్నమును నీళ్ళతో కలుపుకుని తాగుతూ వుంటే కడుపు నొప్పి తగ్గటమే కాకుండా ప్రేగుల్లో వుండే క్రిములు కూడా హరించి పోతాయి.
మతిమరుపు
రోజు ఉదయం పూట 2gm దాల్చిన చెక్క నమిలి తింటూ వుంటే క్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

No comments:

Post a Comment