ప్రత్తి చెట్టు ఔషధగుణాలు
స్త్రీల ఎర్రబట్ట
ప్రత్తి వేరును బియ్యం కడిగిన నీళ్ళతో మెత్తగా నూరి వడపోసి ,ఆ రసం 20gm ,మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి.
చర్మ రోగములు
ప్రత్తి వేరు ను ,ప్రతి పూవులను కలిపి నూరి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గి పోతాయి.
కీళ్ళ నొప్పులకు
లేతగా ఉన్న ప్రతి ఆకును మెత్తగా దంచి ,ఆముధముతో గాని ,ఆవు నెయ్యి తో గాని ఉడికించి. కీళ్ళ మీద వేసి కడుతూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
విషాల విరుగుడుకు
ఎర్ర పతి కాయలను దంచి రసం తీసి వడ పోసి 20 gm మోతాదుగా 2 లేక 3 సార్లు తాగితే నాబి మొదలైన పదార్ధాల విషం విరుగుతుంది.
కాలిన పుండ్లకు
ప్రత్తి పూవులను దంచి రసం తీసి ఆ రసాన్ని కాలిన పుండ్ల మీద లేపనం చేస్తూ వుంటే కాలిన పుండ్లు తగ్గిపోతాయి.
విరేచనం
ప్రతి ఆకు నీటిలో వేసి మరిగించి దాని ఆవిరి గుద స్థానానికి తగిలేలా చేసుకుంటే ,మాటిమాటికి విరేచనం అవుతున్నట్లుగా వుండే సమస్య నివారిమ్పబడుతుంది.
సుక ప్రసవము
ప్రతి ఆకు రసము గిద్దెడు ,ఆవు పాలు గిద్దెడు కలిపి తాగిస్తే స్త్రీలు సుకంగా ప్రసవిస్తారు.
యోని పటుత్వం
ప్రత్తి వేళ్ళను నలగగొట్టి నీటిలో వేసి కాషాయం కాచి ,వడపోసి చల్లార్చి ఆ కషాయం తో స్త్రీలు తమ యోనిని పలు మార్లు కడుక్కుంటూ వుంటే వృద్ధ స్త్రీల యోని అయినా గట్టి పడుతుంది.
వీర్య స్థంబనకు
పైడి ప్రతి దూదిని తేనెతో మైనంతో నూరి వత్తి చేసి ఆ వత్తిని ఆవు నేతిలో వేసి దీపం పెట్టి ,ఆ వెలుతురు లో స్త్రీ తో సంబోగం జరిపితే పురుషునికి వీర్య స్థంబన కలుగుతుంది.
లింగ పటుత్వానికి
ప్రత్తి గింజల పప్పు ఒక బాగము ,మేక కొవ్వు 2 బాగాలు కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని లింగానికి ముందు బాగం వదిలి వెనుక బాగం లేపనం చేస్తూ వుంటే లింగం వంకర పోవుట ,లింగం ముడతపడుట హరించి లింగం బలపడుతుంది.
పండ్ల లోని క్రిములకు
ప్రత్తి గింజలను బాండీలో వేసి మాడ్చి ఆ మసితో పళ్ళు తోముకుంటే పళ్ళ లో చేరిన పురుగులు హరించి పళ్ళు ఆరోగ్యవంతంగా వుంటాయి.
కళ్ళ నొప్పులకు
ప్రత్తి ఆకులను మజ్జిగతో ఉడకబెట్టి కళ్ళ మీద వేసి కట్టుకుంటూ వుంటే కండ్ల నొప్పులు సులువుగా పోతాయి.
కను రెప్పలు ఊడుతూ వుంటే
మంచి ప్రత్తిని ఒక గిన్నెలో వేసి అది మునిగేల ఉమ్మేత్తాకు రసం పోసి రాత్రి అంతా నానబెట్టి ఉదయం పూట ఎండలో పెట్టి రసమంతా ఎగిరి పోయే ల ఎండబెట్టాలి.ఇలా 3 రోజు ల పాటు ఉమ్మేత్తాకు రసం తోను ,3 రోజుల పాటు గుంటగలగార ఆకు రసం తోను బావన చేసి బాగా ఎండిన తరువాత ఆ ప్రత్తి వత్తి లాగ చేసి నువ్వుల నూనె దీపంలో వేసి వెలిగించి ,దాని మంట మీద రాగి పళ్ళెం ఆనించి దానిని మసి పట్టి ఆ కాటుకాను ప్రతి రోజు కండ్లకు పెట్టికొంటూ వుంటే కను రెప్పల వెంట్రుకలు ఊడటం ఆగిపోతుంది.
చెవిలో చీముకు
ప్రతి ఆకులు దంచి రసం తీసి వడపోసి ఆ రసంలో కొద్దిగా గుగ్గిలం ,తేనె కలిపి ,చెవుల్లో 4 చుక్కలు వేస్తూ వుంటే చీము కారటం తగ్గిపోతుంది.
సెగ రోగములకు
ప్రతి గింజలు ,దిరిసెన గింజలు ,పెను వేప గింజలు సమంగా కలిపి అందులో తగినన్ని మర్రి పాలు పోసి ముద్దగా దంచి ఆ ముద్దను బటాని గింజలంత టాబ్లెట్ చేసి ఆరబెట్టి నిలవ చేసుకోవాలి.రోజు ఉదయం పూట ఒక టాబ్లెట్ వేసుకుని పాలు తాగుతూ వుంటే సకల సెగ రోగాలు హరించి పోతాయి.
బహిష్టు ఆగిపోతే
ప్రతి కాయలు పగులగొట్టి నీటిలో వేసి కాషాయం కాచి వడపోసి ,అరపావు లీటర్ కషాయం లో 20gm పాత బెల్లం కలిపి ప్రాతకాలంలో తాగుతూ వుంటే అతి త్వరలోనే బహిష్టు విడుదల అవుతుంది.
వాపులు-వాత నొప్పులు
ప్రత్తి గింజలను నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా నూరి వాపుల మీద వాత నొప్పుల మీద పట్టు వేస్తూ వుంటే అవి తగ్గి పోతాయి.
కాళ్ళ వాపులకు
ప్రతి ఆకు దంచి రసం తీసి ఆ రసాన్ని రాత్రి పూట కాళ్ళకు పట్టిస్తూ వుంటే కాళ్ళవాపులు 4 రోజుల్లో తగ్గి పోతాయి.
గవద బిళ్ళలు
ప్రతి ఆకు దంచి చక్కటి రసం తీసి ఆ రసాన్ని గవద బిళ్ళల మీద లేపనం చేసి పైన దూది అంటిస్తూ వుంటే గవద బిళ్ళలు కరిగిపోతై.
ఎలుక కాటు విషానికి
ప్రతి ఆకు రసం 50gm ,బియ్యం కడిగిన నీళ్ళు 100gm ,కలిపి రోజుకొక మోతాదుగా రోజు ఉదయం పూట తాగుతూ వుంటే ఎలుక కాటు విషం ఎగిరి పోతుంది.
సుక ప్రసవం
ప్రత్తి గింజలు ,మర్రి ఊడల కోణాలు ,గుమ్మడి ఆకులు ఈ 3 సమంగా తీసుకుని మంచి నీటితో మేతగా నూరి ఆ కల్కాన్ని గర్బిణీ స్త్రీ అరికాళ్ళకు లేపనం చేస్తూ వుంటే త్వరగా సుక ప్రసవం జరుగుతుంది.
గడ్దలకు-బిళ్లలకు
ప్రత్తి గింజలను నీళ్ళతో ముదగా నూరి ఆ ముద్ద ను గడ్డల మీద లేక బిల్లల మీద వేసి కడుతూ వుంటే అవి త్వరగా తగ్గిపోతాయి.
రక్త - జిగట విరేచనాలు
ప్రత్తి ఆకుల రసం 30gm పటిక బెల్లం పొడి 30gm , కలపి పూటకు ఒక మోతాదుగా రోజుకు 2 లేక 3 సార్లు పుచుకొంటూ వుంటే సులువుగా రక్త ,జిగట విరేచనాలు ఆగిపోతాయి.
తేలు విషానికి
ప్రతి ఆకులు ,ఆవాలు కలిపి మేతగా నూరి ఆ మిశ్రమాన్ని తెలుకుట్టినచోట వెంటనే మర్దిస్తే విషం వెంటనే క్రిందకు దిగి ,బాధ నిమిషాల మీది తగ్గిపోతుంది.
No comments:
Post a Comment