Saturday, January 24, 2009

స్పొండిలిటీస్ వ్యాధి

పెరుగుతున్న జనాబా ధాటికి దీటుగా ఉన్నామంటూ రోగాలు మానవాళిని వెంటాడుతున్న నేటి రోజులలో ,యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ వారిని పట్టిపీడిస్తున్న వ్యాదులలో SARVAIKIL SPONDDILAITIES ఒకటిగా చెప్పవచ్చు .ఈ వ్యాధిని బారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం లో మన్యాస్తంబం (వాత వ్యాదులలో ఒకటి) గా వివరించారు.


వ్యాధి లక్షణాలు
మెడ వెనుక బాగంలో నొప్పి వెనక కండరాలు బిగిసినట్లు ఉండటము ,బుజాలు మోచేతులు బాగం లో ఉన్న కీల్లల్లో నొప్పి కొన్ని సందర్బాలలో తల నొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వివరించవచ్చు .


వ్యాధి కారణాలు
ఎక్కువగా మెడ పైకేతి చూడటం ,ప్రమాదవశాతు తలకు తగిలే గాయాలు ,ఎక్కువ చేదైన ఆహారపదార్ధాలు తినడం ,పగటి యందు నిద్రించుట ,ఎత్తు పల్లాలలో నిద్రించుట ,సక్రమంగా కూర్చొనక పోవడం ,తలక్రింద ఎతైన దిండు ,వస్తువుల వంటివి పెట్టుకుని నిద్రించుట ,కళ్ళు మిక్కుటంగా తెరచి చూచుట వలన ప్రకోపం చెందిన వాతం కఫం తో చేరి తల వెనుక నున్న మన్యలను 14 సిరలను స్తంబింప చేసి ఈ వ్యాధులను కలుగ చేయును .అంతే కాక వెన్ను పూస మరియు 2 వెన్నుల మధ్యనున్న మృదులాస్థి క్షీణించడం వలన ఈ వ్యాధి కలుగును .ఈ వ్యాధి చికిత్సకు ఉపెక్షించినచో కొన్ని సందర్బాలలో పక్షవాతం కూడా రావచ్చు .తొలి దశలోనే గుర్తించి తగు చికిత్సలు చేసినచో ఈ వ్యాధిని సులబంగా నివారించవచ్చు .

ఆయుర్వేద చికిత్సలు
నారాయణ తైలం గోరువెచ్చగా చేసి మెడ బాగం లో మృదువుగా మర్దనా చేయాలి.
సింహనార గగ్గులు గాని ,యోగరాజు గగ్గులు గాని పూటకు ఒక బిళ్ళ చొప్పున రోజుకు 2 పూటలు వేసుకోవాలి.
నెయ్యి కాని ,నువ్వుల నూనె కాని మెడ బాగంలో తిన్నగా మర్దించి ఆముదపు ఆకులను గాని ,జిల్లేడు ఆకులను గాని నూనె పూసి సెగ పెట్టి కాపాలి.
కోడి గుడ్డు లోని సొనను వేడి చేసి అందులో సైంధవ లవణం కలిపి మెడ బాగంలో మర్దన చేయాలి.
రోగి బలహీనులైనచో ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి వాడాలి.
ఇవి కాక వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడవలసిన కొన్ని ఆయుర్వేద ఔషధాలు వుపయోగించి ఈ వ్యాధి నుండి పూర్తిగా బయట పడవచు.

No comments:

Post a Comment