పసుపు తో ఆయుర్వేదం
దగ్గులు-పిల్లికూతలు
వగర్పు దగ్గులు ,పిల్లి కూతలు మొదలైన శ్వాస కోశ వ్యాధులున్నవారు పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి చల్లార్చిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి బుగ్గన పెట్టుకుని చప్పరించి దాని రసం మింగుతూ వుంటే దగ్గు ,పిల్లి కూతలు తగ్గుతాయి.
నేత్ర వ్యాధులు
పరిశుబ్రమైన పసుపు కొమ్మును నీటితో సాది ఆ గంధాన్ని పెసర బద్ధంత మోతాదుగా కలిములాగా రోజు రాత్రి పూట వాడుతూ వుంటే నేత్ర వ్యాధులు హరిస్తై.
గడ్డలు ,గాయాలు ,బెనుకులు
పసుపు గాని ,పసుపు దంచిన ముద్దను గాని పైన వేసి కట్టడం వల్ల వ్రనములు ,గడ్డలు ,గాయాలు ,కవుకు నొప్పులు ,బెనుకులు హరించి పోతాయి.
తల రోగములు
పసుపు కొమ్మును గంధం తీసి పైన లేపనం చేసిన లేక పైన పట్టు లాగా వేసిన దాని మీద కాపడం పెట్టిన తలదిమ్ము ,తల పోట్లు ,పార్శ్వపు నొప్పి , అపస్మారము శాంతిస్తై.పసుపు పూల రసం గాని ఆకుల రసం గాని వాడిన అదే ఫలితం కలుగుతుంది.
చెవిలో చీము
పసుపు పొడి ,పటిక పొడి కలిపి దూడతో చెవిలో పెట్టి ఊదితే చెవి నుండి కారే చీము ,నెత్తురు ,రసిక తగ్గి పోతాయి.
గోరుచుట్టూ -మడమశీల
పసుపును సున్నపు నీటిలో ఉడక బెట్టి గాని లేక నూనెలో వుడకపెట్టి కాని పైన వేసి కడుతూ వుంటే గోరు చుట్టూ ,మడమ శూల ,జెట్టలు ,గడ్డలు ,కానుపు మాదలు మొదలైనవి హరించి పోతాయి.
పురుగులకు
పసుపు చూర్ణం నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లితే పురుగులు నశిన్చిపోతై.
స్పోటకం మచ్చలకు
పసుపు ,వేపాకు కలిపి ముదగా నూరి నూనె కలిపి వంటికి లేపనం చేస్తూ వుంటే స్పోటకం తాలుకు మచ్చలు ,పుండ్లు మానిపోతై ఇదే ప్రక్రియ ప్రకారం అనేక చర్మ వ్యాధులను సైతం అరికట్టవాచు.
మధుమేహం
మంచి పసుపు ,ఉసిరిక కాయ బెరడు చూర్ణము ఈ 2 సమబాగాలు కలిపి చూర్ణం చేసి రోజు 2 పూటలా 10gm మోతాదుగా మంచి నీళ్ళతో సేవిస్తూ వుంటే క్రమంగా మధుమేహం కుదురుతుంది.
కనురెప్పలు రాలుతుంటే
నిమ్మపందుకు రంధ్రం చేసి అందులో పసుపు కొమ్మును దూర్చి 3 రోజులు నానబెట్టాలి .తరువాత దాన్ని తీసి ఎండబెట్టాలి.మళ్ళీ వేరొక నిమ్మపండులో దాన్ని గుచ్చి 3 రోజులుంచి తీసి ఎండబెట్టాలి.ఇలా చేసిన తరువాత బాగా ఎండిన ఆ పసుపు కొమ్మును నిలవ చేసుకుని రోజు రాత్రి నిద్ర పోయే ముందు ,కొంచెం నీటితో సాది ఆ గంధాన్ని కంటికి కాటుక లాగ పెట్టు కొంటూ వుంటే కంటి రెప్పలు ఊడిపోవడం ఆగిపోతుంది.
No comments:
Post a Comment