సోమరితనము:
ఇది మనిషిని అనేక రకాలుగా నాశనం చేస్తుంది.చదువు పాడవుతుంది.
సంస్కృతి చెడిపోతుంది.
సోమరితనం వున్న వారు ఎందుకు కొరగాని బ్రతుకును అనుబవిన్చవలిసి వస్తుంది.
ఇలాంటి వారి ఇంట్లో తల్లి దండ్రులు , బార్యా పిల్లలు , సంగములో స్నేహితులు అసహ్యించుకుంటారు.పేదలు సంపాదించిన ఆస్తి నిలుపుకోలేక కొత్త సంపాదన గడించలేక దారిద్రాన్ని అనుబవిన్చవలసి వస్తుంది.
ఉదాహరణకు ఉదయం 4 1/2 గంటలకు లేచిన మనిషి , వ్యాయామం , స్నానం , ధ్యానం , పూజ 6 గంటలకు ముగిసి పోయి నిత్య జీవిత కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అన్ని పనులు సక్రమముగా నెరవేరుతాయి.
సోమరితనం వల్ల ఉదయం 7,8 గంటలకు నిద్ర లేచి బెడ్ కాఫీ తాగి పండ్ల బ్రష్ సుమారు అరగంట వేసి , స్నానం పూజ అయ్యేసరికి 10 అవుతుంది.1 గంట భోజనం 11 గంటలు అవుతుంది.
బుక్తాయాసం కొరకు ప్రక్క వాలిస్తే తిరిగి లేచే సరికి 3,4 గంటలు అవుతుంది.తిరిగి టిఫిన్ టీ మొదలుగునవి.మరి పనుల సంగతి దేవుడెరుగు.
.ఎవరేమన్నా కోపము కొట్లాటలే మిగిలేవి.యువతీ యువకులు ఇలాంటి వారున్న కుటుంబాలు చాలా వున్నాయి . తనను తానేరుగని సోమరులకు మంచి ఆలోచనలు ఎలా వస్తాయి.
సోమరితనాన్ని తొలగించుకోవడానికి ఆయుర్వేద శాస్త్రములో చెప్పబడిన యోగాసనాలు ,సూర్య నమస్కారాలు తప్ప ఏ వైద్య శాస్త్రములోను మందులు వుండవు.
Saturday, January 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment