Thursday, January 22, 2009

యుగాలు - రహస్యాలు

శ్రీ నారద పురాణంలో సనక మహర్షి చెప్పిన యుగాల రహస్యాలు - యుగాల ధర్మాలు





నారదుడు సనక మహర్షిని యుగ లక్షణాల గురిచి వివరంగా చెప్పమని అడుగగా ఆయన ఈ విధంగా చెప్ప సాగాడు.

బూలోకములో ఒకప్పుడు ధర్మమూ వృద్ధి చెందుట ,మరొకప్పుడు ధర్మమూ క్షీణించుట జరుగును ఈ తమ స్వబావాలను బట్టి కాలాన్ని కృతయుగము ,త్రేతాయుగము ,ద్వాపర యుగము ,కలియుగము అని విబజించుట జరిగినది.


కృతయుగం లక్షణాలు:


కృతయుగంలో ప్రజలందరూ ధైవంశ సంబూతులుగా ,సాక్షాత్ దైవ స్వరూపులుగా వుంటారు.ఆ యుగంలో దేవతలు ,దానవులు ,గంధర్వులు ,యక్షులు ,రాక్షషులు ,పన్నగులు అనే బేధం ఉండదు.
అందరు సమానమైన దృష్టి కలవారుగా ,ధర్మ పరాయనులుగా ఉంటారు.
ఈ కాలంలో అమ్ముట కొనుట అనేదే ఉండదు .
ప్రజల్లో కామ క్రోధ మోహ లోబ మధ మాత్సర్యాలు మచ్చుకు కూడా కాన రావు.
అందరు ధర్మ సంపన్నులుగా ,తపస్సంపంనులుగా , అసూయరహితులుగా ,సర్వ శస్త్ర పరిజ్ఞానము కలవారుగా ఉంటారు.
ఈ సదాచార పారాయనత వల్ల వారికి కోరుకోకుండానే అన్ని ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఈ యుగంలో సృష్టి కర్త అయిన శ్రీ మన్నారాయణుడు ,ష్కల వర్నుడిగా ,సునిర్మలుడిగా ఉంటారు .
ధర్మం 4 పాదాల నడుస్తూ ఉంటుంది.


త్రేతా యుగము:

ఇక త్రేతా యుగంలో ధర్మం పాండు వర్ణాన్ని పొంది వుంటుంది
శ్రీ హరి రక్త వర్ణంగా మారిపోతాడు.
ప్రజల్లో కష్టాలు మొదలవుతాయి.
అయినా ప్రజలందరు క్రియా యోగ ధ్యాన కర్మలు నిర్వహిస్తుంటారు .
ఈ కాలంలో ధర్మం 3 పాదాలతో నడుస్తూ ఉంటుంది.


ద్వాపర యుగం:

ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలతో నడుస్తుంది .అంటే ధర్మమూ ,అధర్మము చేరి సమానంగా సంచరిస్తూ ఉంటాయి.
హరి పీత వర్నుడిగా మారతాడు.
ఈ యుగం లోనే వేద విబజన జరుగుతుంది .
బ్రహ్మ జ్ఞానము గల పండితులలో సగం మంది అధర్మ నిరతువులవుతారు ,
అరిశాద్వార్గాలకు లోనై ధర్మ బ్రష్టులవుతారు.
ధర్మ సంపాదన ప్రధాన ధ్యేయంగా మారుతుంది.
ఈ యుగం ప్రబావం వల్ల సగం మంది ప్రజలు రోగాములతో,యుద్ధములతో మరణిస్తారు.
కొందరు ప్రజలు వారి వారి స్వయంక్రుత దుష్కర్మల వల్ల అల్పాయువు కలవారై అకాల మరణం చెంద్తారు.
ధర్మ మార్గమ అనుసరించే వారిని చూసి ధర్మ బ్రష్టులైన వారు అసూయపడుతుంటారు.


కలియుగం

ఈ యుగంలో ధర్మం కేవలం ఒక పాదం తో మాత్రమే నడుస్తుంది. అంటే జనంలో 4 వ వంతు మంది ధర్మ పరులుగా ఉండి మిగిలిన వారంతా అధర్మపరులుగా ఉంటారు.
కనుక ఈ యుగాన్ని తామస యుగము లేక రాక్షస యుగము అని కూడా అంటారు.
అందుకే ఈ యుగంలో శ్రీహరి కృష్ణ వర్ణాన్ని పొందుతాడు.
వెయ్యి మందిలో ఒకడు ధర్మ పరుడిగా వుండి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటాడు .
అందరు అతన్ని అగ్నానుడిగా ,పిచి వాడిగా గేలి చేస్తూ ఉంటారు.
యజ్ఞాలు లేనందు వల్ల పంచ బూతాలు కాలుశ్యమై పోయి ప్రలయాలు ,ఉత్పాతాలు తరచుగా సంబవిస్తున్టై.
అసూయ పరులు ,దేవుని అడ్డం పెట్టుకుని బ్రతికే దంబాచార పారాయనులు ,అల్పాయుష్కులు మితిమీరిపోతారు.
బూమి మీద ఈ కాలంలో సకల ధర్మాలు నశించి పోతాయి.కాబట్టి సర్వపాతక సంకరమైన గోరయుగంగా మారిపోతుంది.

బ్రహ్మ జ్ఞాన పండితులంతా వేదాధ్యాన్ని వదిలేసి ధర్మ బ్రష్టులవుతారు.
కపట వేషాలతో కపట బోధనలతో పైకి గొప్ప ధర్మ నిరతులుగా ప్రజలను వంచించి పబ్బం గడుపుకుంటారు
పండితులు వ్యర్ధమైన అహంకారముతో విర్రవీగుతూ సాటి మానవులను ద్వేషిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతూ పతనమై పోతుంటారు.
ప్రతి మనిషి తనకు తానే అందరికన్నా అధికుడనని గర్వ పడుతూ ,వ్యర్ధ ప్రసంగాలతో ,వితండవాదాలతో కాలాన్ని వృధా చేస్తూ అలపాయుష్కులవుతారు.
పాప కర్మల వల్ల ,అన్యాయ స్వాబావం వల్ల పేదలు బ్రతికి ఉండగానే పిల్లలు మరణిస్తూ ఉంటారు.
ఉత్తములుగా ఉన్నతులుగా ఉండ వలసిన వారు నీచులుగా మారిపోతారు.
ఎన్ని నీచ పనులు చేసినా ధనము ఉన్న వారిని ఉత్తములుగా గుర్తించెదరు.
ప్రజలను కన్న బిడ్డల వలె పాలించా వలసిన పాలకులు ,ధన వ్యామోహ పీడితులై ప్రజల పై అదిక పన్నులు వేసి వారిని పీడించి పిప్పి చేసి తమ సొంత ఖజానా నింపుకొందురు.
బర్తను బార్య ,తండ్రిని కొడుకు ద్వేషిస్తాడు. ప్రజలంతా పర స్త్రీ కోసం ,పరుల ఆస్తి కోసం ప్రయత్నిస్తుంటారు.
లేగా దూడలు పాలు తాగకుండా ఆ పాలను అమ్ముకుంటారు.
పండితులు విజ్ఞానాన్ని అమ్ముకుంటారు

ఏ ఒక్కని దృష్టి బాగావంతుని పై ఏకాగ్రతగా నిలబడదు.


కలియుగం-తీవ్ర లక్షణాలు

అధిక మంది స్త్రీ పురుషులు శారీరక సుకాల కోసం వేమ్పర్లాడుతూ శృంగార క్రీడల మీద అధికాసక్తులవుతారు.
పండితులు స్వధర్మాన్ని విడిచి పతనమైతే ,శూద్రులు కషాయం ధరించి ,జటా ధారులై ధర్మాన్ని బోధిస్తుంటారు.
సిగ్గు ,లజ్జా ,అబిమానము ,అవమానము ,తప్పు ,అవినీతి ,అక్రమము ,అన్యాయము అనే ఏ ఒక్క దానిని ప్రజలు కాతరు చేయరు.
నమ్మిన వారిని మోసం చేసి చంపుతారు.
మంచి దారిలో ఉన్న వారిని దొంగ దెబ్బ తీసితీస్తారు ,చెడు పనులు చేస్తూ మంచి చేస్తున్నట్లుగా ప్రచారం పొందేవారు ,పైకి ఒకటి లోపల మరొకటి మాట్లాడేవారు ,ధనమధాంద కారము ,పదవి గర్వము ,కుల పిచి మితి మీరిన వారు కష్టపడకుండా అయాచితంగా అతి త్వరగా కుబెరులై పోవాలనుకునే వారు అధికమై పోతారు.


కలియుగాంత లక్షణాలు

కలియుగం నాలుగో పాదం ముగిసి యుగాంతం జరిగే సమయానికి అప్పటి మనుషుల పరమాయువు పదహారు సంవత్సరాలుగా వుంటుంది.అంటే 16 సంవత్సరాలు బతికితే బాగా బతికినట్లుగా పరిగణింప బడుతుంది.
7 లేక 8 సంవత్సరములు మాత్రమే మనుషులు యవ్వన వంతులుగా వుంటారు.
5 సంవత్సారాల వయసుకే స్త్రీలు పిల్లలనుకంటారు.
పుణ్యం అనే మాట ధర్మం అనే వచనం ఎవరి నోటా వినిపించదు.
తల్లి ,తండ్రి ,గురువు ,బార్యా ,బర్తా కొడుకు అనే బంధాలు పూర్తిగా తెగిపోతాయి.
ప్రజలు 10 సంవత్సారాలకే వ్రుద్దులై పోతారు.వేద పండితులు ధర్మం అనే ముసుగు ధరించి చీకటి పనులలో సిద్ధ హస్తులై ,పర స్త్రీ సంగమముతో కులుకుతూ నరకార్హులవుతారు.
ఈ విధంగా సర్వ ధర్మాలు సర్వ నాశనమైన స్థితిలో బూమి పైన సకల సంపదలు కూడా అదృశ్యమై కరువుకాటకాలతో విలయ ప్రలయాలతో కలియుగాంతం జరుగుతుంది.

1 comment:

  1. em comment cheyagalam inkentha kaalam undi e yugam anthamavadaniki lakshanalu konni kanipistunnai nijamga antha ila maripotunda anipistundi.

    ReplyDelete