Thursday, January 22, 2009

యమలోక మార్గము

ఓ నారదా! మీరు యమ మార్గము గురించి వివరించమని అడిగారు. యమలోక మార్గము 86 వేల యోజనాల విస్తీర్ణము కలిగి వుంటుంది (యోజనము అంటే ఆమడ అనగా 8 మైళ్ళు) ఈ మార్గం , పుణ్యం చేసిన మరణించిన వారికి సుకమైనది గాను , పాపం చేసి మరణించిన వారికి అత్యంత దుక్కమైనది గాను 2 దారులుగా వుంటుంది. అనేకమైన పవిత్ర కార్యాలు , దాన ధర్మాలు , చేసిన మానవులు ఆహ్లాదకరమైన మార్గంలో ఆనందంగా వెళతారు . ధర్మ శూన్యులు , అవినీతిపరులు వెళ్ళే యమ మార్గమంతా , బాయంకర ఆకారులైన యమబటులతో నిండి వుంటుంది. పాపులు వివస్త్రులుగా , తడారిన గొంతులతో , తాగునీరు లబించక , దాహార్తితో కేకలు వేయుచు దీనులుగా వెళుతుంటారు . యమబటుల చేత దారంతా కొరడాలతో కొట్టబడుతూ , అటూ ఇటూ బయంతో బాధతో పరుగులు తీస్తుంటారు. ఆ మార్గమంతా కొంత దూరం బురద ,కొంత దూరం అగ్ని ,ఒక చోట కాలుచున్న ఇసుక ,కొంత ప్రాంతం సూది మొనల వంటి రాళ్ళు ,కొంత దూరం పదునైన ముళ్ళ చెట్లు ,మరికొంత దూరం ఎక్కటానికి వీలు కాని నిలువైన పర్వతాలు ,కటిక చీకటి నిండిన గుహాలు , బయన్కరమైన లోయలు , ఆ లోయల నిండా వెదురు గుంపులు, ఆ గుంపుల నిండా పెద్ద పులులు ,సింహాలు ,ఎలుగు వంటి క్రూర జంతువులు ఉంటాయి.ఈ కటిన మార్గం గుండా పాపులు ఏడుస్తూ ,గగ్గోలు పెడుతూ ,తాళ్ళతో కట్టబడుతూ ,అంకుశాలతో పొడవబడుతూ ,నీడా ,నీరు ,లేని దుర్గమ ప్రాంతం గుండా ,తాము తెలిసీ తెలియక చేసిన పాపకార్యాలను మనసులో జ్ఞాపకం చేసుకుంటూ బారంగా వెళుతుంటారు.

ఏ దానం చేసిన వారు ఎలాంటి సుకాలతో వెళతారు?

ఓ మునివర్య ! దానశీలురు , ధర్మ వర్తనులు మిక్కిలి సుకముతో ధర్మ మందిరమునకు వెళ్లెదరు . పేదలకు అన్నదానము చేసిన వారు , దారి పొడవున రుచికరమైన పదార్ధాలు తింటూ వెళ్లెదరు . జల దానము చేసిన వారు దారంతా తీయని పాలు తాగుతూ వెళతారు . వస్త్రదానము చేసినవారు దివ్యాంబర దారులుగా వెళతారు . ఆపదలో నిరు పేదలను ఆదుకునే వారు దారి పొడవునా దేవతల స్తుతిమ్పబడుతూ వెళతారు . గోదానము చేసిన వారు సర్వ సౌక్యాలతో వెళతారు . పుణ్య కార్యాలకు బూధానం చేసిన వారు , గృహదానము చేసిన వారు . దారి పొడవునా అప్సరసల చేత సన్మానింపబడుతూ దేవతా విమానంలో వెళతారు. వృద్ధాప్యం లోని తల్లి దండ్రులకు సేవ చేసిన వారు దేవతలచే దేవతల చేత పూజింపబడుతూ విమానంలో వెళతారు. విద్యను ,విజ్ఞానాన్ని దానం చేసిన వారు మునుల చేత కీర్తిమ్పబడుతూ ఆశిర్వదిమ్పబడుతూ ధర్మ మందిరానికి వెళతారు

2 comments:

  1. IT'S A VERY IMPORTANT THING TO ALL PERSONS . I LIKE IT .

    ReplyDelete
  2. Its very good message.now i am not going to do any mistake.narada muni explain every thing thanks to naradha muni.

    ReplyDelete