Saturday, January 24, 2009

ప్రాచీన నియమాలు:

[1].సూర్యునికి ఎదురుగా నిలబడి పండ్లు తోముకోకూడదు.

[2].పురుషులు దీపమును ఆర్పకూడదు.ఒక దీపముతో మరొక దీపమును వెలిగించకూడదు.

[3].వ్రతము చేయువారు మంచము మీద నిద్రించ కూడదు.శృంగారంలో పాల్గొనకూడదు.ఒక పూట పలహారము మాత్రమే బుజిమ్పవలెను.తాను ఆహారము బుజించే ముందు పేదలకు గానీ ,బిక్షువులకు గాని కడుపు నింపవలెను.


[4].అమావాస్య నాడు చెట్టు కొమ్మలను గని ,ఆకులను గని తుంచుట బ్రహ్మ హత్యతో సామానమయిన మహాపాపము.


[5].బోజన సమయంలో అన్నదేవత నోటి యందు వుంటుంది కాబట్టి ఆహారము మీదనే దృష్టి నిలిపి ,మౌనంగా బోజనము మీద గౌరవముతో ప్రీతిగా బుజించాలి .ఆ విధంగా తినే ఆహారం మాత్రమే వంటబట్టి దేహానికి శక్తినిస్తుంది.


[6].గడపను తోక్కకూడదు .గడప మీద నిలబడ కూడదు .గడపకు అటు ఒక కాలు ఇటు ఒక కాలు పెట్టి నిలబడి దానము చేయకూడదు.ఇలా చేసిన యెడల గడప ముందు నివాసముండే లక్ష్మి తొలిగి పోయి ఆ కుటుంబం అప్పులపాలగును.

[7].సూర్యునికన్న ముందు నిద్ర మేల్కొనే వారు సదా ఆరోగ్యం తో వర్ధిల్లుతారు .సూర్యోదయం తరువాత నిద్ర లేచే వారు ఎన్ని ఔషధాలు మింగినా ,అమృతమే తాగిన నిత్య రోగిష్టులవుతారు.

[8].ఎవరైనా తాము చేసే మంచి పనికి దానము చేయమని అడిగినపుడు తాను దానము చేయగలిగిన శక్తి గలవాడైతే మాపురమ్మని రేపు రమ్మని తిప్పుకోకుండా వెంటనే దానము చేయవలెను .ఈ దానం వల్ల అశ్వమేధ యాగా ఫలం సిద్ధిస్తుంది .ఎందుకనగా దానము పొందిన ఆ జీవుని ప్రసంనమే దేవుని ప్రసన్నమునకు కారణమవుతుంది.

[9].వ్రతం చేసే రోజున గానీ ,నోములు నోచె రోజు గాని ,ఏదైనా పవిత్రమైన ధైవకర్యం తలపెట్టిన రోజున గాని తన ముకమును అద్దములో చూసుకొన కూడదు.

[10].ఎవరి ఇంటి యందు 24 గంటలు దేవుని గది లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి కలకాలం కాపురముంటుంది .అంతే కాకుండా పిత్రు దేవతలు పరమానందం చెంది తమ సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు .దీపం నువ్వుల నూనెతో గాని ,ఆవు నెయ్యితో గాని వెలిగించి వుండాలి(కరెంటు బల్బులు దీపంతో సమానం కావు).

[11].మనస్పూర్తిగా చేసిన దానము మాత్రమే మంచి ఫలితమునిచ్చును .కోపముతో గాని ,మొగమాటముతో గాని చేసిన దానము వలన పుణ్యము రాకపోగా పాపము సంక్రమించును.

[12].ఏడుస్తున్న పసిపిల్లలను తల్లి గాని ,తండ్రి గాని కొట్టినచో ఆ ఇరువురు నరకమున కు పోవుదురు.

[13].ఒక కాలుతో మరొక కాలును రుద్దుతూ తోముతూ కళ్ళు కడుక్కొన కూడదు .కింది పళ్ళను పై పళ్ళతో నొక్కి రాపిడి చేయకూడదు.

[14].భోజనం తరువాత వేళ్ళతో పండ్లు తోమకూడదు .పుక్కిలించి మాత్రమే ఊసివేయాలి.

[15].పండ్లతో గోళ్ళు కోరకకూడదు.2 చేతులతో ఒకే సారి నెత్తి గోక్కో కూడదు .

[16].నిద్రపోయే అప్పుడు ముకమును కూడా దుప్పటితో కప్పకూడదు . బోజనము చేసేటప్పుడు నోటితో శబ్దము చేయకూడదు .ఉదయం సాయంత్రం సంధ్యాసమయాల్లో నిద్ర పోకూడదు అంతకు మించి దరిద్రం మరొకటి లేదు.


[17].సంబోగం లో పాల్గోనినప్పుడు ధరించి ఉన్న బట్టలు ,ఉతికిన తరువాత కూడా వాటిని పూజా సమయంలో ధరిమ్పరాదు.


[18].మెదలపైనా ,గోడలపైన మంచం పైనా కూర్చొని చేసే జపము ,ధ్యానము ,నిరుపయోగము .బూమిపైన ధర్బాసనము గాని ,గొంగళి గాని ,పట్టు వస్త్రము గాని ,పులి చర్మము గాని పరచుకుని దానిపైన కూర్చుండి జపము చేయవలెను.

[19].ఆహారము బుజించే సమయంలో చేతిలోకి తీసుకున్న ముద్ద సగం నోటి లోకి పోయి మిగిలిన సగం మల్లి విస్తరలోకి పడకూడదు.

[20].బోజనానికి ముందుగానే ఎక్కువ నీరు తాగితే అజీర్ణం కలుగుతుంది.

[21].గణ పదార్దములు తినేటప్పుడు మధ్య మధ్య లో కొంచెం మంచి నీరు తాగాలి.

[22].మజ్జిగ అన్నం తిన్న తరువాత ఎక్కువ మంచి నీళ్ళు తాగితే కఫము పెరుగుతుంది.

[23].కొబ్బరి తిని గాని ,అరటి పండు తిని గాని ,తాంబూలం వేసుకుని గాని వెంటనే మంచి నీళ్ళు తాగకూడదు.

[24].భోజనం చేసేటపుడు జపము చేసేటపుడు శిరస్సును ముట్టుకోకూడదు.

[25].గారిక పోచాలతో దుర్గా మాతను ,మొగలి పూవులతో శివుని ,అక్షతలతో సాలాగ్రమమును ,తులసి తో వినాయకుని పొరపాటున కూడా పూజింపకూడదు.

[26].తులసి ఆకు ,పండ్లు ,పూలు ,పుస్తకము ,గారిక పోచలు ,ధర్బముడి ,పండితుల వ్రుష్టము ,శ్రీకుచములు ,రుద్రాక్షలు ,తులసి పూసలు వీటిని బూమి మోయలేదు.కాబట్టి వీటిని ఎప్పుడు బూమి మీద పెట్ట కూడదు.అనగా ఇవి నెలకు తగలకూడదు.


[27].చెక్క పీట మీద కూర్చుని చేసే జపం వల్ల దరిద్రం కలుగుతుంది.మేడి కర్ర పీత మీద కూర్చుని జపం చేస్తే సిద్ధిస్తుంది.

[28].వేప పుల్ల గాని మరే పుల్లనైన తోలు తీయకుండానే దంతధావనం చేయాలి.


[29].వెలగ కాయ పగటి పూట తిన కూడదు.వెలగ చెట్టు నీడ కూడా పగటి పూట పనికి రాదు.

[30].రావి చెట్టు నీడను రాత్రి పూట తొక్క కూడదు .రావి చెట్టును శనివారము తప్ప మిగిలిన రోజులలో ముట్టరాదు .తాటి చెట్టు నీడ ఎపుడు తొక్క కూడదు.

2 comments:

  1. its very useful to the viewers of uur website, bcoz we cant go through all these rules anywhere else..........nice idea

    ReplyDelete
  2. meru teliyanivi kuda koni cheapparu
    thanks

    ReplyDelete