కలబంద(ఆలోవీర) తో ఆయుర్వేదం
[1]. కలబంద గుజ్జును చెక్కెర తో కలిపి సేవించడము గాని ,రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని ,ఆరోగ్యాన్ని పొందవచ్చు.
[2].కలబంద రసం ,పాలు ,నీళ్ళతో కలిపి సేవిస్తే ,సెగ రోగం ,గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.
[3].కలబంద గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డల పై కడితే తగ్గి పోతాయి.
[4].కలబంద రసం లేదా వేరు ను పసుపు తో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.
[5].కలబంద రసాన్ని పసుపు తో కలిపి సేవిస్తే లివర్ ,స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.
[6].కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.
[7].రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను బుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.
[8].కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.
[9].కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు ,సూర్య తాపము వలన ,X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.
[10].చర్మ సౌందర్యానికి ,ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను ,వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక ,దీని గుజ్జును కూడా అంటించవచ్చు.
[11].కఫా వ్యాదులలో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.
[12].పంటి నొప్పి ,పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని ,కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.
[13].దగ్గు నివారణకై 1 స్పూన్ ,మిరియాలు 1/4 స్పూన్ , శొంటి 1/4 స్పూన్ ,తేనె లో కలిపి సేవించాలి.
[14].కడుపు నొప్పి లోను ,కడుపు లో గ్యాస్ ఏర్పడినపుడు ,గోధుమ పిండి ,కలబంద గుజ్జు పై వాము ,సైంధవ లవణము ,జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని బుజించాలి.
[15].అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ ,కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.
[16].చెవి పోటు యందు కొంచెము వేడి చేసి పిండిన కలబంద ఆకు రసాన్ని 1,2 చుక్కలు చెవిలో వేయాలి.
[17].కండ్ల కలక యందు కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.
[18].ఎండాకాలము వడదెబ్బ నందు కలబంద రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.
[19].కలబంద గుజ్జు ను నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.
Nice Remedies..
ReplyDelete