Saturday, January 24, 2009

అనపకాయ(సొరకాయ) తో ఆయుర్వేదం

వీర్య స్థంబనకు
సొరకాయ ముక్కలను ఆవు నేతిలో పరిమితంగా తింటూ వుంటే శీగ్ర స్కలన సమస్య తగ్గి పోయి రతిలో ఎక్కువ సేపు వీర్యం నిలుస్తుంది.
మూత్ర బిగింపునకు
బాగా పండిన అనపకాయ తీగను సమూలముగా తీసుకుని కాల్చి బస్మము చేసి ,ఆ బస్మాన్ని నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి నీరు ఇగిరి పోయే వరకు మరిగించి అడుగున మిగిలిన దాని క్షారం తీసి నిలువ వుంచుకోవాలి. మూత్రం బాదిన్చినపుడు ,లేదా బొట్లు బొట్లుగా పడి బాదిన్చినపుడు ఈ క్షారం 3gm మోతాదుగా ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగితే వెంటనే మూత్ర బిగింపు హరిన్చిపోయి మూత్రం ధారాళంగా వెలువడుతుంది.
స్త్రీల ప్రదర రోగము
అనబకాయ ముక్కలను యండ బెట్టి దంచి పొడి చేసి నిలువ వుంచుకోవాలి.ఈ చూర్ణము అర చెంచా నుంచి ఒక చెంచా మోతాదుగా బియ్యం కడిగిన నీటితో గాని లేక తేనెతో గాని కలిపి 2 పూటలా తాగుతూ వుంటే స్త్రీల బట్టంటు రోగాలు తగ్గిపోతాయి.
వేసవి పగుళ్ళు
అనబ కాయ లోని పప్పును మెత్తగా నూరి పగుళ్ళ మీద లేపనం చేస్తూ వుంటే వేసవి పగుళ్ళు హరించి పోతాయి.
స్త్రీల రక్తస్రావము
అనబ కాయ మీద బెరడు ,తెల్ల బియ్యం కలిపి నీటితో మెత్తగా నూరి మూత్రద్వారము వద్ద లేపనము చేస్తూ వుంటే స్త్రీల అతి రక్తం కట్టుకుంటుంది.

1 comment:

  1. sorakaya mukkalanu nethilo veyinchukoni thinala enni gramulu enthakalam tinali

    ReplyDelete