మర్రిచెట్టు తో ఆయుర్వేదం
[19]. లేత మర్రి చెట్టు ఊడలను నీళ్ళతో మెత్తగా మర్దించి వాలిపోయిన స్తనముల పైన లేపనము చేయుచుండిన 3 వారములలో కన్య స్తనముల వలె ధృడముగా ఉండును.
[20]. లేత మర్రి ఆకులను నీడన ఆరబెట్టి ,ఎండబెట్టి చూర్ణము గావించి పూటకు 3gm చూర్నమును పాలు ,పంచదార కలిపి సేవించు చుండిన 40 రోజు లలో నీరుడు బిగించే మూత్ర కచ్చ వ్యాధి జీవితాంతము రాకుండా హరించి పోవును.
[21]. మర్రి ఊడల చివర వుండు పీచు లాంటి సన్నని వేళ్ళను నీటిలో నూరి త్రాగించుచుండిన యెడల ఏ మందుల వలన కూడా తగ్గనటువంటి డోకులు తగ్గిపోతాయి.
[22]. మర్రి ఊడలను పెరుగుతో నూరి పైన పట్టు వేసిన శరీరము పై కాలిన అంగముల యందలి మంట వెంటనే శాంతించును.
[23]. మర్రి ఊడల కోణాలను దంచి తీసిన రసము పూటకు 2 తులాల చొప్పున ఇచ్చుచుండిన కళ్ళతో రక్తము పడే వ్యాధి హరించును.
[24].లేత మర్రి ఊడలను నీడన ఆరబెట్టి ,ఎండించి చూర్ణము గొట్టి అందు సమబాగమున పంచదార కలిపి పూటకు అర తులము చొప్పున వారము రోజులు సేవించిన యెడల మూత్రము ,పచగా వాచుట ,వీర్యము పలుచబదుట ,మూత్రము బోయునప్పుడు మంట మొదలగు మెహ వ్యాధులు హరించి శరీరమునకు బలము కలుగును.
[25]. కత్తి మొదలగు ఆయుధములచే పెద్ద పెద్ద గాయములు ఏర్పడినపుడు గాయము యొక్క 2 అంచులను ఒకటిగా జేర్చి పైన వెచ్చజేసినా మర్రి ఆకును వేసి కట్టు కట్టిన యెడల 3 రోజులలో చర్మం ఆశ్చర్యముగా కలిసిపోవును.
[26]. మర్రిచెట్టు యొక్క పాచి కాయలను ఎండించి ,చూర్ణము గావించి పాటకు 15gm చూర్నమును అర గ్లాస్ పాలు పంచదార కలుపుకుని సేవించుచుండిన యెడల శరీరమునకు అధిక బలము కలుగును.
[27]. ఎండించిన మర్రి ఊడలను బస్మము గావించి 3gm బస్మమును నీళ్ళతో కలిపి ఇచ్చు చుండిన యెడల డోకులు కట్టును ,వంతులు హరించును.
[28]. సెగ గడ్డల పైన మర్రి ఆకును వేచా జేసి కట్టిన యెడల తొందరగా పగిలి పోవును.
[29]. పండు మర్రి ఆకులను కాల్చి బస్మము చేసి అందు తేనె ,మైనము ,నెయ్యిని ,కలిపి మేతగా నూరి పుండ్లు పై పట్టించిన యెడల అన్ని రకముల పుండ్లు హరించును.
[30]. లేత మర్రి ఆకులను ఎండబెట్టి చూర్నించి అందు సమబాగమున పంచదార కలిపి 10gm చొప్పున మంచి నీళ్ళు అనుపానముతో సేవించు చుండిన స్త్రీల యొక్క తెల్ల బట్ట వ్యాధి హరించును వేడి చేసే పదార్ధాలు తినకుండా ఉండవలెను.
[31]. లేత మర్రి ఆకులూ మెత్తగా నూరి అందు తేనె పంచదార కల్పుకుని ప్రాతహకాలమందు తినుచుండిన యెడల రక్త పిత్త వ్యాధి తగ్గును.
very good Karthik garu, meeru cheppina ayurveda chitkaalu chaalaa bagunnavi. Thank you.
ReplyDeletesivaprasad
cspvsp@yahoo.co.in
sivajivizag@gmail.com