Saturday, January 24, 2009

అతి సులువైన జానపద వైద్య విధానాలు

గొంతులోని పుండ్లు మరియు కాంతులు నివారణకు
బోజనము ముందు నేతిలో మిరియము పొడిని 2gm మోతాదుగా కలిపి సేవించవలెను .

నడుము నొప్పి
[1].హారతి కర్పూరము ,సాంబ్రాణి మెత్తగా నూరి గుడ్డకు పట్టించి పట్టు వేయవలెను.

[2].నొప్పి గల చోట బాగుగా ఆముధమును రాసి జిల్లేడు ఆకుల విస్తరి కుట్టి నొప్పి గల చోట కట్టి నులక మంచము పెట్టి క్రింద మేక ఎరువుతో కుంపటి పెట్ట వలెను.

[3].దేశవాళి గుగ్గిలము ఆముధమున నూరి నీళ్ళను కడిగిన వెన్న వలెనగును.దానిని గుడ్డకు పట్టించి పట్టు వేయవలెను.

[4].కర్పూర తైలముతో పట్టు వేయవలెను.

పెదవుల పగుళ్ళు
ఉప్పును నేతితో నూరి పెదవులకు పూసిన పగుళ్ళు మానును .

కాలిన గాయాలు
[1].మజ్జిగలో సుద్దను కలిపి రాయవలెను.

[2].కాలిన గాయాల పై చల్లని తడి మన్నును రాయవలెను.

[3].మూత్రమును ఆరగ ఆరగ రాయవలెను.

[4].కలబంద రసమును వేసి కట్టు కట్టవలెను.

[5].సున్నపు నీళ్ళలో కొబ్బరి నూనె ను వేసి గట్టిగా చిలికి దానిలో గుగ్గిలము పోడుమును వేసి పాకముగా వండి పూయవలెను.

[6].కాలిన చోట బ్రాంది పోసిన పొక్కక మంటను తగ్గించును.

అజీర్ణము
[1].వాము ,ఉప్పు ,మిరియాలు సమపాళ్ళల్లో కలిపి దోరగా వేయించి పొడి చేసి పరగడుపున మూడు వేళ్ళకు వచునంత సేవించవలెను.

[2].రెండు చింత గింజలను పెనం పై కాల్చి పోట్టును గీకి వేసి నోటిలో వేసుకుని పోకల వలె నమిలి మింగిన అజీర్ణము దానివలన కలిగిన గుండె మంట నివారనమగును.

[3].40gm నిమ్మరసములో ,జీలకర్ర 3 gm ,సైంధవ లవణము 3gm ,అల్లపు ముక్కలు 10gm ,వేసి 3 గంటలు నానబెట్టి ప్రతి రోజు ఉదయము తినవలెను.

[4].దాల్చిన చెక్క ,యాలకులు ,మిరియాలు సమపాళ్ళలో పొడి చేసి కలిపి పొడి చేసి పూటకు 3gm చొప్పున బెల్లముతో కలిపి పుచ్చుకోనవలెను .

[5].నీరుల్లిపాయను పచ్చి దానిని ముక్కలుగా కోసి బోజనముతో తినవలెను.

[6].నేతిలో వండిన అన్నమును బుజించిన చక్కగా జీర్ణమగును.

[7].నిమ్మరసములోతినే సోడాను 5 gm కలిపి ఒక ఔన్సు నీళ్ళను కలిపి తాగవలెను.

[8].గిద్దెడు నీళ్ళల్లో ఒక తులము ఉప్పును కలిపి తాగవలెను.

[9].పంచదార లేక బెల్లపు పానకమును పుచ్చుకోనవలెను .

[10].రాత్రి రాగి చెంబులో పోసి యుంచిన నీటిని ఉదయము పరగడపున తాగవలెను.

ఆకలి అగుటకు
[1].రెండు గ్రాముల అల్లములో కొంచెము ఉప్పును వేసి ఉధయముననే తినవలెను.

[2].5gm ల శోంటి చూర్నమును పావు గ్లాస్ బియ్యము కడిగిన నీళ్ళల్లో కలిపి పూచుకోనవలెను.

అరుచి
[1].కాల్చిన అల్లపు ముక్కను ఉప్పు తో అది తినవలెను.

[2].ఆవాలను నూరి నాబి పైన ప్రతి రాత్రి పట్టు వేయవలెను.

[3].అల్లపు రసములో తేనె ను కలిపి నాకవలెను.

[4].బోజనమున మొదటి ముద్దలో శోంటి పొడి ఉప్పు తో కలిపి తినవలెను.

శ్వేత కుష్టు(బొల్లి)
[1].వేప కాయలు , పువ్వ్వులు , ఆకులను కలిపి నూరి అర తులము పూటకు చొప్పున 4 రోజులు సేవుంచావలెను.

[2].రోగి పురుషుడైన స్త్రీ ఋతు రక్తమును శ్వేత కుష్టు మచలపై పూయవలెను.రోగి స్త్రీ అయిన పురుషుని ఇంద్రియమును మచ్చల పై పూయవలెను .ఇట్లు చేసిన శ్వేత కుష్టు మచ్చలు శాశ్వతముగా నివారనమగును.

నేత్ర వ్యాధులు
కలబంద లో పటిక కలిపి కండ్లలో పోసిన కంటి దెబ్బలు పోవును.

No comments:

Post a Comment