తులసి వైద్యం
[1].నోటి దుర్వాసన పోవటానికి తులసి ఆకులు ,మిరియాలు కలిపి రోజు నిత్యము నమిలి మింగాలి.
[2].నిత్యము 5,6 తులసి ఆకులు నమిలి మింగు చుండిన రక్తపు పోటు శాంతిస్తుంది.
[3].చెవి పోటు నందు 2,3 చుక్కలు తులసి ఆకు రసము వేయాలి .
[4].మలేరియా మరియు ఇతర జ్వరాలతో తులసి యాకు రసం 1 స్పూన్ ఉదయం సాయంత్రం సేవించాలి.
[5].తులసి కాషాయ సేవనంతో జలుబు ,రొంప ,శిరశూల ,జ్వరాలు తగ్గి పోతాయి.
[6].తులసి ఆకు రసం లో తేనె కలిపి సేవించిన తల తిరగటం ,బరమ ,పిత్త వికారాలు తొలగుతాయి .
[7].తులసి వేరును అరగదీసి ఆ గంధాన్ని తేలు కాటు ,తేనె తీగలు ఇతర క్రిములు కరచిన చోట లేపనం చేస్తే ఉపశమనం కలుగుతుంది.
[8].తులసి యాకులు ,తాగే నీటిలో లేదా తేనీటిలో రోజు వేసుకుని సేవించిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
[9].పసి పిల్లలకు వచ్చు కడుపుబ్బరం లో తులసి రసం ,తమలపాకు రసం సమానం తీసుకుని 10 చుక్కల చొప్పున రోజుకు 3,4 సార్లు పట్టాలి.
[10].పెద్ధలకేర్పాడు ఉదర వ్యాదులలో (కడుపు ఉబ్బరం) తులసి రసం అల్లపు రసం సమానం తీసుకుని 1 స్పూన్ మోతాదు ప్రతి 2 గంటలకు ఒకసారి సేవించాలి.
[11].శరీరము పై ఏర్పడు నల్లని మచ్చలకు తులసి ఆకు రసం పొంగించిన వేలిగారం తో కలిపి ముకానికి లేపనం చేయాలి.
[12].తల పై వచ్చు చుండ్రు కు ,తులసి యాకు రసాన్ని రుద్ది ఆ తరువాత వేప నూనె మసాజ్ చేస్తే తగ్గిపోతుంది.
[13].శరీరము పై ఏర్పడు దురద ,చర్మ వ్యాధులకు తులసి రసాన్ని పై లేపనానికి 1 స్పూన్ రోజు కు 2 సార్లు లోపలికి సేవించాలి.
[14].కాన్సర్ వ్యాధి రోగికి కూడా తులసి యాకులు ప్రతి నిత్యం రోజు తినిపిస్తే ఉపశమనం కలగటమే కాక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
[15].తులసి గింజల కషాయాన్ని అర్శమొలల వ్యాధి కల వారికి నిత్యం తాగించాలి.
[16].తల పై పేలు గల వారికి ,రాత్రి పడుకునే ముందు తులసి యాకు రసం తలపై అంటించాలి.
[17].తులసి యాకులు ,వేరు ఎండించి చూర్ణము చేసి ముక్కు పొడిగా ఉపయోగించిన ముక్కు సంబంధ వ్యాధులు తగ్గి పోతాయి.
[18].శరీరము పై ఏర్పడు దద్దుర్ల తో (ఎలర్జీ) తులసి రసాన్ని అంటించిన ఉపశమనం కలుగుతుంది.
[19].అన్ని రకములైన చర్మ వ్యాదులలో తులసి రసము ,నిమ్మ రసము సమానం కలిపి చర్మము పై లేపనం చేయవలె
tulasi lo kuda different types untay kada like krishna tulasi, rama tulasi etc., ilanti vaidyalaki vadataniki edi manchidantaru??
ReplyDeletedown syndrome ki edhiyna vaidyam wundha...
ReplyDelete