ఏ బెల్లం మంచిది
కొత్త బెల్లం ఏ విధంగా మంచిది కాదు.దాన్ని తినటం వల్ల కడుపులో పురుగులు పుట్టుకోస్తై .మలబధకం కలుగ చేస్తుంది.ఎక్కువ మూత్రం విసర్జిమ్పజేస్తుంది.శ్వాసకోశ వ్యాధులను కూడా కల్గిస్తుంది.
పాత బెల్లం అంటే కనీసం ఒక సంవత్సరం పాటు నిలువ వున్న బెల్లం ఎంతో ఉతమమైనది.దానిని వాడటం వల్ల సర్వ రోగాలు తాపాలు జ్వరాలు హరించి పోతాయి.నోటికి రుచి పెంచి జీర్ణ శక్తిని కలిగిస్తుంది.పండు రోగం ప్రమేహా రోగాలలో బెల్లం అమోగంగా పనిచేస్తుంది.
వాంతులు
బెల్లము జీలకర్ర సమంగా కలిపి దంచి ఉసిరికాయంత ఉండలు చేసి రోజూ 4,5 సార్లు ఒక్కొక్క ఉండ తింటూ వుంటే వాంతులు కట్టుకుంటై.
తెలు కాటుకు
బెల్లం గంజాయి ఆకు కలిపి నీలతో నూరి ఆ ముద్దను తెలు కుట్టిన చోట పట్టిస్తే విషం పైకి ఎక్కకుండా ఆగిపోయి బాధ కొద్ది సేపట్లోనే తగ్గిపోతుంది.
ఎలుక విషానికి
బెల్లం ,నువ్వుల నూనె ,జిల్లేడు పాలు కలిపి మెత్తగా నూరి చేతి గోళ్ళకు లేపనం చేస్తే ఎలుక విషం విరిగి పోతుంది(పై పూతకు మాత్రమే).
నీళ్ళ విరేచానములకు
బెల్లం ఆవాలు సమబాగాలుగా తీసుకుని మేతగా నూరి ,బట్టాని గిన్జలంత మాత్రలు చేసి ,పూటకు ఒక మాత్ర చొప్పున మంచి నీళ్ళతో 3 పూటలా వేసుకుంటూ వుంటే నెల్ల విరేచనాలు తగ్గిపోతాయి.
అల్సర్
పాత బెల్లం ,అల్లం ,నువ్వులు సమంగా దంచి పూటకు ఉసిరికాయంత ముద్ద కొద్ది కొద్దిగా తింటూ ఉంటే అల్సర్ తగ్గుతుంది.
అందమైన ఆరోగ్యం
ఆవు పెరుగులో మంచి పాత బెల్లం కలుపుకుని రోజు తింటూవుంటే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
విషమ జ్వరాలకు
బెల్లం 20gm లు తీసుకుని దానిలో జీలకర్ర చూర్ణం గాని ,వాము చూర్ణం గాని ,కొంచెం దోరగా వేయిన్చి కలిపి దంచి పూటకు ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గి పోతాయి.
తలనొప్పికి
బెల్లము ,శొంటి సమంగా కలిపి దంచి ఆ ముద్దను మాటిమాటికి వాసన చూస్తూ వుంటే తలనొప్పి తగ్గిపోతుంది .
పార్శ్వపు తలనొప్పి
పాత బెల్లం 24gm ,కర్పూరం 2gm కలిపి మెత్తగా నూరి ప్రతి రోజు ఉదయం పూట ఒక మోతాదుగా తింటూ వుంటే పార్శ్వపు తల నొప్పి తగ్గి పోతుంది.
బోదకాలు
పాతబెల్లం ,మంచి పసుపు సమంగా కలిపి నూరి పూటకు 10gm ,మోతాదుగా 30gm గోమూత్రములో కలుపుకుని 2 పూటల తాగుతూ వుంటే క్రమంగా బోదకాలు ,కుష్టు ,అతి దాహము తగ్గిపోతాయి.
కీళ్ళ నొప్పులకు
బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము ,ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు మెడిమల నొప్పులు తగ్గిపోతాయి.
అన్ని రకాల ముక్కు రోగాలు
బెల్లం 280gm ,శొంటి 30gm ,పిప్పళ్ళు 30 gm , యాలకులు 30gm తీసుకుని అన్ని కలిపి దంచి పూటకు చిన్న ఉసిరికాయలంత మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే అన్ని రకాల ముక్కు రోగాలు తప్పకుండా పోతాయి.
వాత సంబంధ గొంతు బొంగురు
బెల్లము ,నెయ్యి సమంగా కలిపి 2 పూటలా కొద్ది కొద్దిగా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గి గొంతు బాగుపడుతుంది.
బెల్లం పాకం పట్టి అందులో దోరగా వేపిన మిరియాల చూర్ణం కలిపి నిలువ ఉంచుకుని రోజు పూటకు 5 gm మోతాదుగా తింటూ వుంటే గొంతుబొంగురు తగ్గుతుంది.
అరికాళ్ళు అర చేతుల్లో పొరలు ఊడుతుంటే
బెల్లం అల్లం సమంగా కలిపి నూరి పూటకు 5 నుండి 10gm మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే అరికాళ్ళు అర చేతుల్లో పొరలు ఊడటం తగ్గిపోతుంది.
ధద్దుర్లకు
బెల్లం ,వాము సమబాగాలుగా కలిపి దంచి ,రేగి పండ్లనత టాబ్లెట్స్ చేసి నిలువ ఉంచుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 లేక 3 పూటల ఆవ నూనెలో ముంచుకుని తింటూ వుంటే దద్దుర్లు హరిన్చిపోతై.
కనబడని దెబ్బల నొప్పులకు
పాత బెల్లం చిక్కగా పాకం కాచి అందులో తగినంత నెయ్యి కలిపి పూటకు 100gm చొప్పున 2 పూటల సేవిస్తో వుంటే కవుకు దెబ్బలు నొప్పులు హరించి పోతాయి.
పుండ్లు-వ్రాణాలకు
పాత బెల్లం ,పొంగించిన వేలిగారం ఈ రెండు సమంగా కలిపి నూరి పుండ్ల మీద ,వ్రణాల మీద లేపనం చేస్తూ ఉంటే తగ్గిపోతాయి.
మూత్రం బిగిస్తే
గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పాత కలిపి తాగుతూ వుంటే మూత్రబిగింపు తగ్గిపోతుంది.బెల్లం ,జీలకర్ర కలిపి తింటూవున్న తగ్గిపోతుంది.
ఉప్పు
సాధారణ పాముకాటుకు
బురద పాము లేదా తుట్టె పురుగు లేదా మామూలు పాములు కరచినప్పుడు ,కరచిన చోట కత్తితో కొద్దిగా గీరి రక్తము పిండి ఉప్పు సున్నము కలిపి నూరిన ముద్దను కాటుపై మర్దించిన యెడల విషము దిగును.
కలరా వ్యాధికి
ఉప్పు ,మిరియాలు ,జిల్లేడు పూవులు సమబాగాలు తీసుకుని కలిపి మెత్తగా నూరి బట్టని గిన్జలంత టాబ్లెట్స్ చేసి గంటకు ఒక టాబ్లెట్ చొప్పున 5,6 మాత్రలు వేసుకుంటే కలరా హరించిపోతుంది.
దెబ్బల వాపులకు
ఉప్పు ,వెల్లుల్లి పాయలు సమబాగంగా తీసుకుని మెత్తగా దంచి ఆ ముద్దను వాపు మీద వేసి కడుతూ వుంటే 2 కట్ల లోనే వాపు తగ్గి పోతుంది.
అధిక పైత్యమునకు
ఉప్పు ,చింతపండు ,మిరియాలు ,శీకాయ చెట్టు చిగురాకులు కలిపి వచ్చి పచడిలాగా నూరి ,ఆ పచ్చడిని అన్నంలో కలుపుకుని తింటూ ఉంటె అదికపైత్యం హరించిపోతుంది.
ఆకలి-అజీర్ణం
ఉప్పు ,శొంటి సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని బోజన సమయంలో మొదటి ముద్దలో 5gm పొడి కలిపి తింటూ వుంటే నాలుక ,గొంతు శుబ్రమై కఫము తగ్గి ,ఆకలి పెరిగి ,ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
కడుపు నొప్పి
ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రిన్చినట్లుగా కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది.
చలి జ్వరం
ఉప్పు ,మిరియాలు ,పిప్పిన్టాకు(మార్కొన్డాకు) ఈ 3 సమంగా కలిపి కచాపచాగా నలగగొట్టి గుడ్డలో వేసి మూటగట్టి దాని వాసన పదే పదే చూస్తూ వుంటే చలి జ్వరం రాకుండా వుంటుంది.
చిన్న పిల్లల కడుపు నొప్పి
నల్ల ఉప్పు 10gm ,నిప్పుల మీద వేసి పొంగించిన వెలి గారము 5gm ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి 2 పూటల పూటకు చిటికెడు మోతాదుగా నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల కడుపునొప్పి తగ్గుతుంది.
తల నొప్పులకు
తినే ఉప్పు ,పాతిక బెల్లం ఈ రెండూ సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని 2 పూటల 2 gm పొడిని గోరువేచని నీటిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గి పోతాయి.
పిల్లల ఉదర వ్యాధులు
నల్ల ఉప్పు సోంపు గింజలు సమంగా తీసుకుని మెత్తగా దంచి నిలవచేసుకుని ,రోజు 2 పూటలా ఒక గ్రాము పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల ఉదర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.
స్త్రీల హిస్టీరియా
నల్ల ఉప్పు 10 gm ,తినే ఉప్పు 10gm ,ఇంగువ 3gm , సైంధవ లవణం 10gm , నూరే కారం 10 gm ,పిప్పళ్ళు 10gm ,శొంటి 10gm , ఆవాలు 10gm ,ఇవన్ని కలిపి చూర్ణం చేసి కొద్దిగా నిమ్మ పండ్ల రసం తో మర్దించి నిలువ చేసుకోవాలి .రోజు 2 పూటల పాటకు 3gm మోతాదుగా వేడి నీళ్ళతో సేవిస్తూ వుంటే స్త్రీ ల హిస్టీరియా నశించి పోతుంది.
చెవిలో పురుగు దూరితే
చెవిలో పురుగు దూరితే ఉప్పు ,వేపాకు కలిపి దంచిన రసము 4 చుక్కలు చెవిలో వేస్తే వెంటనే క్షణాలలో పురుగు బయటకు వస్తుంది.
ఫిట్స్ వచ్చినపుడు
ఉప్పును నీటిలో వేసి కరిగించి వడపోసి ఆ ఉప్పు నీటిని 3 ,4 చుక్కలు ముక్కులో వేస్తే ఫిట్స్ వల్ల అపస్మారము వల్ల తెలివి తప్పిన వారు వెంటనే కోలుకుంటారు.
వాపులకు-నొప్పులకు
ఉప్పును వేయించి మూట గట్టి దానితో కాపడం పెడుతూ వుంటే వాపులు ,నొప్పులు వెంటనే తగ్గుతాయి.కడుపు నొప్పికి ,గుండె నొప్పికి ఇదే విధంగా కాపడం పెట్టడం ద్వారా నొప్పులు నెమ్మదిస్తై.
Saturday, January 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment