Thursday, January 22, 2009

సంపూర్ణ పురుష సౌందర్య శుభా అశుబ లక్షణాలు

శివుడు పార్వతితో చెప్పిన సంపూర్ణ పురుష సౌందర్య శుభాశుబ లక్షణాలు




కైలాస శికరం మీద పార్వతీ పరమేశ్వరులు సుకాసీనులై వుండగా పరమేశ్వరుడు పరమానందంగా మందహాస వదనారవిన్దుడై ప్రసన్నుడిగా వున్న సమయంలో ,పార్వతీ దేవి ఆయనతో "నాదా! గతములో ఒక సారి తమను ప్రశ్నిచినపుడు కలియుగంలోని స్త్రీ సంపూర్ణ శుబాశుబ లక్షణాలను వివరించవలసిందిగ కోరుతున్నాను ,అని ప్రేమగా అడుగగా పరమేశ్వరుడు ప్రసన్నమానసుడై ఈ క్రింది విధంగా చెప్పటం మొదలు పెట్టాడు.
దేవి! సంపూర్ణ పురుషుడు అనబడువాడు ,ముందుగా ధర్మార్ధ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్ధాల మీద తగిన అవగాహనము ,వాటిని సాధించటంలో విశ్వాసాన్ని కలిగి వుండాలి.
కండ్లలో కనుపాప తప్ప మిగిలిన తెల్ల గుడ్డు ,దంతాలు మిక్కిలి తెలుపు రంగులో వుండాలి.
గంబీరమైన ,ఇంపైన కరునారణతరంగితమైన కంట స్వరం కలిగి వుండాలి .
కామ క్రోధ లోబ మోహ మధ మాత్సార్యాలనే అరిషద్వార్గాలకు అతీతుడిగా ,ఓర్పు ,నేర్పు ,దయ ,మానవత్వము ,ఆహిమ్సతత్పరతా ,సమతాబావము ,స్వీయ సంస్కృతి పట్ల ఆరాధన వీటికి ప్రతిరూపుడిగా వుండి తీరాలి.
ధైర్యము ,సాహసము ,నిజాయితి మూర్తి బావించి వుండాలి .
అన్యాయాన్ని ఎదిరించే పరాక్రమంతోను ,అగ్నాన్ని తరిమి కొట్టే విజ్ఞానం తోను ,దారిద్రాన్ని రూపుమాపే సిరిసంపదతోనూ ,సాహసవంతుడై ,జ్ఞానవంతుడై ,ధనవంతుడై ,కీర్తిని సంపాదించి ఉండాలి.
ఉదరము మీద కంటము మీద అడ్డంగా మూడు గీతలు కలిగి ,దేవతలకు ,గురువులకు ,పేదలకు వినమ్రుడై వుండాలి.
రొమ్ము ,నుదురు ,ముకము విశాలముగా వుండి ,లటాలము పైన అరచేతులలోను 4 రేకలు ఉండవలెను.
చేతివేళ్లు ,కాళ్ళ వెళ్ళు ,హృదయము , వీపు ,కంటి ప్రదేశము ,బుజాలు ,మోకాళ్ళు ,పిక్కలు ,తొడలు ,ఇవన్ని వాటి వాటి స్థానానికి తగిన ప్రమాణాలతో వుండి దేహ ప్రమాణము 96 అంగుళముల పొడవు కలిగి వుండాలి.
మీసములు ,కనుపాపలు ,కనుబొమ్మలు ,తల వెంట్రుకలు ఇవి నల్లగా నిగారిమ్పుగా వుండాలి.
ముక్కు ,నోరు ,చెవులు ,చంకలు ,మర్మస్తానాలు దుర్వాసన లేకుండా సుగంధ యుక్తంగా వుండి శిశ్నము(మర్మాంగము) మెడ పిక్కలు ,ఈ మూడు మరి పొడుగ్గా మరి పొట్టిగా గాని లేకుండా మధ్యమ స్థాయిలో వుండాలి .
శిశ్నము వంకర లేకుండా తిన్నగా వుండాలి .
చర్మము ,వెంట్రుకలు ,నేత్రాలు ,దంతాలు ,గోళ్ళు ,పెదవులు ఇవి మెరుగు కలిగి సన్నగా వుండాలి .నాలుక ,పెదవులు ,దౌడలు ,కన్నులు ,హస్తములు ,పాదములు ,అరచేతులు ,అరికాళ్ళు ,శిస్నాగ్రము ,నోరు ఇవి పద్మాకారముగా ఉండవలెను.
హస్తాలు ,పాదాలు ,మెడ ,చెవులు ,రొమ్ము ,శిరస్సు ,నుదురు ,ఉదరము ,వీపు ఇవి ఉన్నతమైనవి గా విశాలంగా వుండాలి .
నిర్మలమైన దృష్టి ,మధురమైన వాక్కు ,మదపుటేనుగు వంటి నడక కలిగి ఒక్కొక్క రోమ కూపములో ఒక్కొక్క రోమమే కలిగి వుండే పురుషున్ని మహా పుణ్య వంతుడు ,మహా సౌందర్య వంతుడు అంటారు.

1 comment:

  1. please keep the more information with the clarity.

    ReplyDelete