Thursday, January 22, 2009

ఆచరించండి

గంగి గోవును కాపాడండి


గంగి గోవు అన్ని రకాల ఔషధ మొక్కలు మాత్రమే తింటుంది .అందుకే గంగి గోవు ఓంకార స్వరూపమై సర్వదేవతా స్వరూపమయి ప్రతి పూజకు ఆవు ప్రధానమయినది .పంచామ్రుతములో ఆవు పాలు ,ఆవు పెరుగు ,ఆవు నెయ్యి ,అరటి ,తేనె లేనిదే చేయకూడదు .ఆవు పేడ ,ఆవు పంచితం తోనే ఎవరైనా ఇంటిలో శుచి ,శుబ్రం చేయుచున్నారు .రక్షించండి - మూపురం గల గంగి గోవులను పారద్రోలి ఆవుల్ని ,సంకరాలని ,వాటి వీర్యాలని ,మన ప్రాచీన శాస్త్రాలు మేనరికల్లో పిల్లలు సరిగా పుట్టారని చెబుతూనే "మన ప్రాచీన మూపురంగుల గంగి గోవు పాల పెరుగును తల్లులకు 3 వ నెల నుండి 9 వ నెల వరకు రోజూ తినిపిస్తే మన కన్న అందమైన ,బలమైన ,ఆరోగ్య మైయిన ,సంపూర్ణ సౌష్టవం గల పిల్లలు సందేహమే లేకుండా కల్గుతారని వరమిచ్చినాయి .ఆవు చుట్టూ రోజు తిరిగే వారికి ఆరోగ్యం బాగా వుంటుంది.హరప్పా ,మొహంజొదారో వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు జాతి ఎద్దులు సైతం సంకరం వల్ల మాయమైనవి.జాతి ఎద్దులు 6 అడుగుల ఎత్తులో బలంగా ,అందంగా ,ఆరోగ్యంగా ,గంబీరంగా ఉంటాయి .ఆవులు 20 - 30 లీటర్ ల పాలామ్రుతనిస్థాయి.కాని సంకరాలు 3 అడుగులతో ,రోగాలతో ,వికృతంగా బలహీనంగా బితర చూపులతో తిరుగుతుంటాయి.గమనించండి సంకర ఎద్దులు మన ఎద్దులు 4 వ వంతు బరువు లాగడానికి కూడా కష్టపడుతుంటాయి.


గంటె అయిన చాలు గంగి గోవు పాలు - కుండ అయిన నేమి కరిమి గాడిద పాలు.


ప్రకృతిని పూజించండి .వెధయుక్త ,జ్ఞాన ,శాస్త్రీయమైన ,మనప్రాచీన సంప్రదాయ మన కన్న తల్లి వంటిది నేడున్న విద్యుతు ,పరిశ్రమలు ,కంప్యూటర్స్ మన బిడ్డల వంటివి.బిడ్డలున్నారని కన్న తల్లిదండ్రులను వదిలేస్తామ.


ప్రేమ:

మంచితనము లేదా గొప్పతనమే ప్రేమ తన వలన ఇతరులు కూడా ఉండాలి అని జాగ్రతగా ప్రవర్తిన్చేదే ప్రేమ.

అంతేగాని సినిమాల్లో చూపించే సెక్స్ అల్లరి ,గొడవ చంపుకోవడము ,నీచగుణం ఇది ప్రేమ కాదు.

బుద్ధుడు దశావతారాల్లో తోమ్మిదవని చాటండి .

నేడున్న బలరాముడు ఆదిశేషుడని తెలుసుకోండి.

కల్కి 3,5 లక్షల సంవత్సరాల తరువాత గాని అవతరించాడు.

కలియుగము 4,32,000 సంవత్సరాలో నేడు 5102 మాత్రమే .

కావున మన సంప్రదాయాలను కాపాడుకుందాము.


పాలు తాగావదనే ప్రచారం నమ్మకండి :ఇటీవల కాలంలో కొంత మంది ఆరోగ్య శిక్షణ శిబిరాల పేరుతో ప్రచారం నిర్వహిస్తూ ముక్యంగా పాలు తాగవద్దని ప్రజలకు నూరి పోస్తున్నారు .సహజ జీవన విధానానికి బిన్నంగా ఏదో ఒక ప్రత్యేక నినాదం ఉంటేనే ప్రజలను ఆకర్షించగాలమనే వ్యర్ధ ప్రచారమే వీరిలో కనిపిస్తుంది.ఇప్పటికే ఇంగ్లీష్ వైద్యుల పుణ్యమా అని నూనె ,నెయ్యి తీపి పదార్దములు ,వెన్న మొదలైన శక్తి వంతమైన పదార్ధాల వాడుక తగ్గి పోయి ప్రజలు చైతన్య హీనులవుతున్న ఈ దశలో మిగిలివున్న ఆ ఒక్క పాలు కూడా తాగ వద్దని ప్రచారం చేయటం ప్రజలను ఎందుకు పనికి రాని దద్దమ్మలుగా చవటలుగా సారహీనులుగా చేయటం జాతికి శ్రేయస్సు కాదు.

[1].పిల్లలు పుట్టిన తరువాత 6 మాసాల్లోను ,ఆవు దూడలు 6 వారాల్లోనూ ,పంది పిల్లలు 18 రోజుల్లో ,కుందేలు పిల్లలు వరం రోజుల్లోనూ పుట్టినప్పటి కన్నా రెట్టింపు బరువును పొంద కలుగుతున్నాయి.ఈ పెరుగుదల కేవలం పాల వల్లనే అని మర్చి పోకండి.బారతీయ చతుర్వేదాలు ,ఆయుర్వేదము పాలను కొనియాడాయి.ఆధునిక శాస్త్ర వేత్తలు కూడా పాలలో ఉన్నన్ని జీవనీయ పదార్ధాలు ఏ ఇతర పదార్ధాలలో లేవని గంటాపధంగా నిర్ధారించారు.

[2].పాలు అమృత తూల్యమైన ద్రవం .ఈ ద్రవం లో 101 రకాల జీవనీయ పదార్ధ విశేషాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేతలు ప్రయోగాత్మకంగా నిర్ధారించారు.

[3].పాలలోని 3 రకాల ప్రోటీనులలో 19 ఎమినో ఆసిడ్ లు ,11 రకాల కొవ్వు పదార్ధాలు ,6 రకాల విటమిన్లు ,8 రకాల ఎంజైమ్ లు ,25 రకాల కనిజాలు ,5 రకాల బాస్వరం మిశ్రమ పదార్ధాలు ,14 రకాల నత్రజని సంబంధ పదార్ధాలు ,చెక్కర మిళితమై ఉన్నాయని పేర్కొన్నారు.

[4].శరీరంలో ప్రతి చిన్న బాగానికి అవసరమైన కాల్షియం ,బాస్వరం మొదలైన పదార్ధాలను పాలు సమృద్ధిగా అందిస్తాయి.

[5].పాలలో ప్రోటీన్లు ,కార్బోహైడ్రేట్లు ,కొవ్వు ,కనిజ లవనాలలో బాస్వరం ,పొటాషియం,సోడియం ,క్లోరిన్ ,మెగ్నీషియం ,సల్ఫర్ మొదలైనవి పేర్కొనదగినవి.

[6].పాలలో A,B,C విటమిన్లు కొంచెం D విటమిన్ ఉన్నాయ్ .పాలల్లో ఉండే చెక్కర ఇతర పదార్ధాలలో ఉండే చేక్కరలా తొందరగా పులిసిపోదు.

కనుక పాలు తాగావద్దనే బూటకపు ప్రచారం నమ్మకుండా మంచి పాలు సేవిస్తూ మంచి ఆరోగ్యం పొందండి.

2 comments:

  1. palu gurinchi chala chakkaga vivarincharu.
    dhanyavadamulu:)

    ReplyDelete
  2. Ayya

    ee tarunopayalanii pdf file
    lo download chesukogaligela
    vunchite ajantham runapadivuntamu.
    namaskaramulu
    arssrao@hotmail.com

    ReplyDelete